Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-కూకట్పల్లి
మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో సోమవారం మహిళా మోటార్ డ్రైవింగ్ ట్రాక్‌ను, సీసీ రోడ్లను మంత్రి సత్యవతిరాథోడ్ ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ, మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి, మహిళ కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సబిత, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను ప్రోత్సహించడానికి, వారు స్వయం ఉపాధి పొండానికి, తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. సమాజంలో మహిళలు 50 శాతం ఉండగా అవకాశాలలో మాత్రం చాలా తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం మహిళ రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉందన్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో, అదేవిదంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మహిళల అభ్యున్నతికోసం ఆలోచిస్తారని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మ ఒడి, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని గుర్తు చేశారు. మహిళా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి ప్రకృతి వనంలో భాగస్వాములు కావాలన్నారు. మహిళలకు ఆత్మ విశ్వాసం పెంపొందించేలా మోటారు డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం మొదలుపెట్టడం ఒక శుభపరిణామం అన్నారుఅనంతంర జూట్ శిక్షణ పొందిన (14) ట్రాన్స్ ఉమెన్స్లకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. శిక్షణ పొందిన (64) మందికి రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా కుట్టు మెషిన్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షులు వెంకట్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు నేని చంద్రకాంత్ రావు, ఎండి. ఇబ్రహీం, ప్రదీప్‌రెడ్డి, రావుల రాములుగౌడ్, షౌకత్ అలీ మున్న, రవీందర్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, మధులత, సత్తూర్ శిరీష, స్వప్న, దేవి, వరలక్ష్మి, పద్మకుమారి, స్వరూప, మంజుల, వనజ తదితరులు పాల్గొన్నారు.