Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఐపీఎస్ ఏకే ఖాన్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు తెలుగు మీడియం అభ్యసించి సివిల్స్ పరీక్షలో విజయం సాధించినట్లు మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ తెలిపారు. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమైతే జీవితం పట్ల ఆలోచించే విధానంలో మార్పులు వస్తాయని అన్నారు. సోమవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లా ఎక్స్లెన్స్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన 2021 సివిల్స్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్, మాజీ ఐఏఎస్ అధికారి అజరు మిశ్రా హాజరై ప్రసంగించారు. అభ్యర్థులకు ఓపిక, నేర్చుకునే తత్వం ఉంటే కచ్చితంగా సివిల్స్ పరీక్షల్లో విజయం సాధిస్తారని అన్నారు. లా ఎక్స్ లెన్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ఒకే ఇన్స్టిట్యూట్లో 53 ర్యాంకులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా 2021 సివిల్స్ పరీక్షలో సత్తాచాటిన మౌర్య, సంజన, కిరణ్మయి, పవిత్ర లను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారులు సాధు నరసింహారెడ్డి, చంద్రశేఖర్, యశ్వంతరావు, తదితరులు పాల్గొన్నారు.