Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్‌నగర్
సామాజిక బాధ్యతగా జర్నలిజం వృత్తిని ఎంచుకోవడంతోపాటు మానవీయ కథనాలను కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించి బాధితులకు సాయం అందించేలా కషి చేసిన జర్నలిస్టులను సన్మానించడం బాధ్యతగా భావిస్తున్నానని నరసింహనాయుడు సినిమా ఫేం ప్రీతి జింగానియా అన్నారు. ట్విన్ సిటీస్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రహమత్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రీతిజింగానియా హాజరై జర్నలిస్టులకు ప్రశంసా పత్రం అందచేసి సన్మానించారు. షాహిద్ భగత్‌సింగ్ మెమోరియల్ అవార్డ్స్ ఉత్తమ జర్నలిస్ట్‌గా సాక్షి టీవీ జర్నలిస్టు సాయికుమార్ని బంజారాహిల్స్‌లోని హోటల్లో ఏర్పాటు చేసిన అవార్డ్స్ కార్యక్రమంలో నర్సింహనాయుడు ఫేమ్ ప్రీతి జంగియానీ చేతుల మీదుగా అందుకున్నాడు. కరోన విపత్తు సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా జర్నలిస్టులు చేసిన సేవలను కొనియాడారు.