Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
బాగా వైవిధ్యభరితమైన రియల్ ఎస్టేట్ బ్రాండైన ఈవీఎల్ గ్రూప్, తన దశాబ్దపు ఉద్యోగులను ఒక ఇంటితో సత్కరించనున్నట్టు ప్రకటించింది. అతిథిగా విచ్చేసిన దయానందరెడ్డి, బెంగళూరు అర్బన్ మాజీ ఎమ్మెల్సీ, పారిశ్రామికవేత్త, పరోపకారితో పాటు ఈవీఎల్ గ్రూపు చైర్మెన్ ఫౌండర్ డాక్టర్ భాస్కర్, వైస్ చైర్మెన్, కో-ఫౌండర్ వీరకుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సురేష్ బాబు, ప్రభాకర్, వెంకట కిరణ్, వివేక్, సుబ్బారావు హైలైట్ ను సులభతరం చేశారు. సంస్థకు తమ సేవలను అంకితభావంతో అందించడానికి, పదేండ్లకుపైగా సేవల ందించిన ఉద్యోగులకు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఈఎల్వీ గ్రూప్ చైర్మెన్ డాక్టర్ భాస్కర్ మాట్లా డుతూ ఇల్లు అనేది ప్రతి ఒక్కరి పెద్ద కల అనీ, ఈ కలను ఎంతోమందికి అందిం చడంలో మేం అగ్రగామిగా నిలిచామన్నారు. మా ఎదుగుదలకు తమ జీవితా లను అంకితం చేసే ఉద్యోగుల కలలను సాకారం చేసుకోవడానికి మేం నైతికంగా బాధ్యత వహించామని తెలిపారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమలో ఉండటం వల్ల, ఇంటిని బహుమతిగా ఇవ్వడం ఉత్తమ చర్యగా భావించినట్టు తెలిపారు.