Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్మెట్
డ్రయినేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం కవాడిగూడ డివిజన్ ప్రాగా టూల్స్ చౌరస్తా వద్ద రూ.26 లక్షలతో నిర్మించనున్న నాలా స్లాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా ఏండ్లుగా నాలా స్లాబ్ శిథిలావస్థకు చేరిందని, ప్రజల విజ్ఞప్తి మేరకు దానిని పునర్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో స్లాబ్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ సన్నీ, ఏఈ తిరుపతి, వర్క్ఇన్స్పెక్టర్ దాసునాయక్, టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, సాయికష్ణ, సీనియర్ నాయకులు బింగి నవీన్, ముచ్చకుర్తి ప్రభాకర్, భోలక్పూర్ డివిజన్ ప్రెసిడెంట్ వైస్ శ్రీనివాస్, నాయకులు రాంచందర్, రాజశేఖర్ గౌడ్, రాజేష్, జమాలుద్దిన్, రాజు యాదవ్, శ్రీహరి, రజక వేణు, ప్రవీణ్ గౌడ్, ఉమాకాంత్, దుర్గ స్వామి, సత్యనారాయణ, కరిక కిరణ్, నారాయణ, సురేష్, ఆటో శీను, కార్తీక్, కేఎం సాయి తదితరులు పాల్గొన్నారు.