Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి బుధవారం సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్లో పర్యటించారు. లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లాలాపేట్ చౌరస్తాలో అన్నపూర్ణ 5 రూపాయల భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ సర్కిల్ 29 డిప్యూటీ కమిషనర్ దశరథ్, ఏఎంఓహెచ్ రవీందర్ గౌడ్, ఏఈ వెంకటేష్, సానిటేషన్ సూపర్వైజర్ థనా గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సునీల్ ముదిరాజ్, వినోద్, వేణుగోపాల్ రెడ్డి, ఖాజా పాషా, బలరాం, యాదిగిరి, వంజరి వెంకటేష్, నాగేశ్వర రావు, శివ శంకర్, బాబు పాల్గొన్నారు.
వారాసిగూడలోని వాటర్ లైన్ పనులను కార్పొరేటర్ సామల హేమ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని కోరారు. అనంతరం ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్ పాల్గొన్నారు.
బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ మంగళవారం వారాసిగూడలో వివిధ అధికారులతో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పరిసరాల పరిశుభ్రత కషి చేయాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దష్టికి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.