Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రభుత్వ సిటీ కాలేజీలో టీఎస్ కేసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 26 విద్యార్థులు వివిధ సంస్థల్లో రూ.2.8 నుంచి 5 లక్షల సంవత్సరాదాయంతో ఉద్యోగాలు సాధించినట్లు కాలేజీ ప్రిన్సిపల్ బాల భాస్కర్ తెలిపారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఐటీ సొల్యూషన్స్, ఫార్మా, హోమియో రంగాలకు చెందిన 11 కంపెనీలు వివిధ దశల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు చెప్పారు. మరో 13 మంది విద్యార్థులు, ఆయా సంస్థల నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందుకున్నారని, విద్యార్థులంతా తమ డిగ్రీ ఫైనల్ పరీక్షల అనంతరం విధుల్లో చేరవచ్చని అన్నారు. కార్యక్రమంలో డా.ఝాన్సీరాణి, డా.వాసుదేవ రెడ్డి, డా.కష్ణ చంద్ర, డా.మల్లికార్జున్ పాల్గొన్నారు.