Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
అంగన్వాడీ కేంద్రం పిల్లల భవిష్యత్తుకు పునాది అని ఐసీడీసీ చార్మినార్ ప్రాజెక్ట్ గౌలిపుర సెక్టార్ సూపర్వైజర్ ప్రభావతి అన్నారు. గురువారం గౌలిపుర సెక్టార్ రాజీవ్‌గాంధీ నగర్, సాయిబాబా నగర్ కేంద్రాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మ పాలు వదిలిన చిన్నపిల్లలకు పోషకాహారంలతోపాటు విద్యాబుద్ధులు నేర్పించడానికి మొదటిమెట్టు అంగన్వాడీ అని అన్నారు. పిల్లలు ఆటలు, పాటలతో పాటు విద్యాభ్యాసం నేర్చుకుంటారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అనురాధ, విజయలక్ష్మి, అమ్ముల్ను, గాయత్రి, సత్యమ్మ పాల్గొన్నారు.