Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-బేగంపేట
బోనాల ఉత్సవాలు ప్రారంభానికి ముందే అభివద్ధి, నిర్మాణ పనులు పూర్తి చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బాటా నుంచి ఓల్డ్ రాంగోపాల్‌పేట పోలీసు స్టేషన్ వరకు రూ.92 లక్షలతో చేపట్టిన వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్‌వర్క్స్ ఎండీ దాన కిశోర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న వివిధ కాలనీలు, బస్తీలకు వెళ్లే అంతర్గత రహదారుల లెవెలింగ్లో తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కతికి ప్రతీకగా నిలిచేది బోనాల ఉత్సవాలు అని తెలిపారు. ఈనెల 30 నుంచి ఆషాడ బోనాల జాతర ప్రారంభం కానుందని చెప్పారు. జులై 17న నిర్వహించే మహంకాళి బోనాలకు లక్షలాదిగా ప్రజలు వస్తారని, అందుకు తగినట్లుగా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆలయ పరిసరాల్లో ఎలాంటి సీవరేజీ లీకేజీలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మహంకాళి ఆలయం నుంచి ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వరకు కాలినడకన బయలుదేరి మార్గమధ్యలో మంత్రి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మహంకాళి అమ్మవారి ఆర్చిని పరిశీలించారు. తదనంతరం గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని పరిసరాల్లో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ పనులను ఆగస్టు 15వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ అనిల్‌రాజ్, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, కార్పొరేటర్లు మహేశ్వరి, హేమలత, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి ఉన్నారు.