Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దశల వారీగా అభివృద్ధి పనులు చేపడతామని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మెన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో రూ.2 లక్షలా 50 వేలతో కల్లు దుకాణం నుంచి ముదిరాజ్ బస్తీ వరకు మంచి నీటి పైప్ లైన్, లక్ష్మి నగర్ ఫేస్ 1లో రూ.2 లక్షలా 50 వేలతో అంతర్గత భూగర్భ డ్రయినేజీ కాలువ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, డీఈ సుమతి, నాయకులు కొత్త భాస్కర్ గౌడ్, మడ్డి పాండు గౌడ్, రాజు ముదిరాజ్, కొత్త రాజు గౌడ్, గణేష్ వంశీ కృష్ణ, నర్సింగ్ సింగ్, డీజే ప్రశాంత్, మురళి, మహిళా నాయకురాలు జయ పాల్గొన్నారు.