Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
క్యాన్సర్ సర్వైవర్స్ డేని పురస్కరించుకుని, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్్ (ఏఓఐ), హైదరాబాద్‌లో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు, వైద్యులు మరియు సంరక్షకులు ఇతర పేషెంట్స్ కు పరస్పర ప్రేరణను అందించడానికి మరియు వారి అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్‌ను ప్రారంభించారు.
క్యాన్సర్‌తో విజయవంతంగా పోరాడిన పేషెంట్స్‌ను సత్కరించడానికి మరియు జీవితాన్ని ఆనందముగా జరుపుకోవడానికి ఒక ఫోరమ్‌ను రూపొందించి, క్యాన్సర్‌ను ఎదుర్కొన్న వారి అనుభవాలను పంచుకోవడానికి మరియు వారి ప్రయాణంలో ఇతరులను ప్రేరేపించడానికి ''క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్ కార్యక్రమాన్ని ఆహ్వానించింది. మెడ, ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము వంటి వివిధ రకాల క్యాన్సర్లతో విజయవంతంగా పోరాడిన పేషెంట్స్ మరియు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'భారతదేశంలో క్యాన్సర్ల భారం'పై (ఐసీఎంఆర్) నివేదిక ప్రకారం, 2025లో క్యాన్సర్ భారం 29.8 మిలియన్లకు పెరగనుంది. అందువల్ల, అనుభవాలు పంచుకోవడానికి సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన అన్ని అంశాలను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడటానికి పీర్-టు-పీర్ క్యాన్సర్ సపోర్ట్ ఈ సమయంలో అవసరమని అని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కాన్సర్ వైద్య నిపుణులు తెలిపారు. కాన్సర్ బారిన పడినంత మాత్రానా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గతంలో క్యాన్సర్‌తో విజయవంతంగా పోరాడిన పేషెంట్స్ అనుభవాలను పంచుకుంటారు.
ప్రతి ఒకరిలో అవగాహన అవసరం
2025 కళ్ళ భారతదేశంలో29.8 మిలియన్ల మంది కాన్సర్ బారిన పడే అవకాశముందని రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ పి. ప్రభాకర్ తెలిపారు ఈ సందర్బంగా డాక్టర్ మాట్లాడుతూ ''కాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కాన్సర్ నిర్దారణ మరియు చికిత్స అనేది ఒక ప్రక్రియ అన్నారు. పేషెంట్స్‌కు అడుగడుగునా ప్రేరణ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా కుటుంబసభ్యులు, స్నేహితులు ధైర్యంతో సానుకూలంగా స్పందించాలన్నారు. కాన్సర్‌ను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. కాన్సర్ బారిన పడిన వారిపై సానుభూతితో కాకుండా ప్రేమతో పలకరించాలన్నారు. వారి బాధను గుర్తు చేసుకోకుండా వారు మర్చిపోయే వాతావరణానికి తీసుకరావడం మంచిదని అభిప్రాయపడ్డారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) ద్వారా కాన్సర్ కి అత్యాధునిక టెక్నాలజీతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, మంచి ఫలితాలిస్తున్నాయని అన్నారు. దక్షిణాసియాలో 16 మా ఆసుపత్రులున్నాయని, అందులో అనుభవం కలిగిన ప్రముఖ సీనియర్ వైద్యులున్నారని తెలిపారు''.