Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
వందేళ్ల చరిత్ర గల ధర్మవంత్ హిందీ శిక్షణ సంస్థల ప్రాంగణంలో హిందీ విశ్వ విద్యాలయాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు తెలిపారు. తద్వారా దక్షిణ భారత దేశంలోనే హైదరాబాద్ కేంద్ర బిందువుగా మరి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం ధర్మవంత్ హిందీ శిక్షణ సంస్థల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ పూర్వ విద్యార్థులు మిలింద్ ప్రకాశన్ సంపాదకులు శతికాంత్ భారతి, విశ్రాంత ప్రిన్సిపాల్ వెంకటేశం, శ్రీధర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ధర్మవంత్ శిక్షణ సంస్థల పరిధిలలోని విద్యాలయాల్లో మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య, మాజీ మంత్రులు దేవేందర్ గౌడ్, మాధవరెడ్డి, మాజీ మేయర్ తీగల కష్ణారెడ్డిలతో పాటు న్యాయవాదులు, వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులు విద్యానభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించారని గుర్తు చేశారు. అనంతరం ట్రస్టీ ప్రొఫెసర్ చంద్రదేవ్ భగవంత్ రావు కావాడే మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సహకారంతో హిందీ విశ్వ విద్యాలయం స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల్లో శతమానోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మవంత్ హిందీ శిక్షణ సంస్థల ట్రస్టీ ప్రొఫెసర్ సురేష్ పురి, ఎస్.గైబువల్లి, హిందీ ప్రచార సభ ప్రదాన కార్యదర్శి జె.ప్రేమ్ కుమార్, ఎం.శ్రీరాములు, ఫాయాజుద్దీన్, వెంకటేష్, నాందేవ్, శివ, నవీన్ కుమార్, శ్యామలాల్ తదితరులు పాల్గొన్నారు.