Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
పెండింగ్లో ఉన్న అర్హులైన వికలాంగులు, వితంతు వులు, ఒంటరి మహిళలు, వయో వృద్ధ లబ్దిదారులకు వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని సోమవారం సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ జి.రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మల్కాజిగిరి మండల కమిటీ నాయ కులు బంగారు నర్సింగ్ రావు మాట్లాడుతూ నాలుగే ండ్లుగా వికలాంగులు, వయో వృద్ధులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా ఏ ఒక్కరికీ ఇంత వరకూ పింఛన్ మంజూరు కాలేదన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ పరిధిలోని అనేక మంది దరఖాస్తు చేసుకున్నా, మూడేండ్లుగా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ఆసరా పింఛ్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనీ, లబ్దిదారులకు పింఛన్లు అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్దిదారులకు ఆసరాగా ఉండాల్సిన ఆసరా పింఛన్లు అందడం లేదనీ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దరఖాస్తుదారులందరినీ గుర్తించి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దశలవారీగా బాధిత లబ్దిదారులతో ఆందోళన నిర్వహించి, పింఛన్ల వచ్చేంతవరకూ తమ పార్టీ ఆధ్వ ర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మల్కాజి గిరి మండల కమిటీ నాయకులు బి.మంగ, జై.వైష్ణవి, రాజ్యలక్ష్మి, బి. శ్రీనివాస్, నాగమణి, దీపిక, ఉమామ్మ, సంతోష, బాలమణి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.