Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
నవతెలంగాణ-అంబర్‌పేట
మట్టి వినాయకుల తయారీ రంగానికి ప్రోత్సాహం అందిస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గురువారం బాగ్‌అంబర్‌పేట డివిజన్ పరిధిలోని రామకష్ణ నగర్ కమిటీ హాల్లో మహిళా, పొదుపు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల తయారీకి ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తన సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తానని, మహిళా సాధికారత కషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మలక్‌పేట్ ఏసీపీ వెంకటరమణ, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, సీపీఐ(ఎం) నాయకులు మహేందర్, ఏఎంహెచ్ఓ జ్యోతి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు చందు, సీనియర్ నాయకులు కనివేట నర్సింగ్ రావు, మిరియాల రవీందర్, కంచె మహేష్ పాల్గొన్నారు.