Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
ఎన్నో మధురగీతలను స్వరకల్పనతో నాడు సినీ రంగ సంగీత ప్రపంచంలో కీర్తి పొందిన సాలూరి రాజేశ్వర రావు అనంతరం సాలూరి వాసురావు ఆయన సోదరుడు కోటి తండ్రి బాటలోనే నడిచి సినీ సంగీతంలో ప్రత్యేక ముద్ర వేశారని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలో వంశీ ఆర్ట్స్ థియేటర్, శుభోదయం గ్రూప్ నిర్వ్యహణలో సాలూరి వాసురావుకు విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మరిస్తూ ఆయన స్మారక పురస్కార ప్రదానోత్సవం జరిగింది. సుమన్ పాల్గొని పురస్కారం బహుకరించి మాట్లాడారు. వాసు రావు గిటార్ వాయిద్య కళాకారునిగా ఆరంభించి సంగీత దర్శకునిగా గొప్ప పాటలను అందించచారని కొనియాడారు. బాలు గానం చేసిన అన్నమయ్య చిత్రంలో తన బాలాజీ పాత్రను శాశ్వతంగా చరిత్రలో నిలిపారని గుర్తు చేసుకున్నారు. సాహితీవేత్త వోలెటి పర్వ్యతీశం అధ్యక్షత వహించిన సభలో రచయిత పీఎస్ గోపాల కష్ణ, తిరుమల గ్రూప్ చంద్రశేఖర్, ఒమాన్ దేశ నుంచి వచ్చిన అనిల్, శుభోదయం ప్రతినిధి హరి వేణుగోపాల్ పాల్గొన్నారు. వంశీ రామరాజు స్వాగతం పలికిన సభకు తొలుత అమెరికా శారద, వినోద్, గీతాంజలి, శశిధర్, స్వాతి తదితరులు మధుర గీతలు ఆలపించారు.