Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీసీ ప్రొఫెసర్ రవీందర్
నవతెలంగాణ-ఓయూ
విదేశీ విద్యార్థులకు ఓయూ గమ్యస్థానంగా మారిందని వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. ఉన్నత విద్య, పరిశోధనల్లో ఆయా దేశాల విద్యార్థులు రాణిస్తున్నారని వివరించారు. భారతీయ-అమెరికన్లు కూడా తమ పిల్లలను ఉన్నత విద్య కోసం ఉస్మానియాకు పంపాలని సలహా ఇచ్చారు. తద్వారా నాణ్యమైన విద్య, భారతీయ విలువలను పొందగలరని సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా చికాగో నగరంలో ఓయూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశానికి అక్కడి భారత కాన్సుల్ జనరల్, ఐఎఫ్ఎస్ అధికారి అమిత్ కుమార్తో కలిసి హాజరయ్యారు. ప్రపంచ పోకడలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ లాంటి కోర్సులు విద్యార్థులకు ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తున్నామని రవీందర్ వెల్లడించారు. రోబోటిక్స్, బ్లాక్ చైన్, క్లౌడ్ కంప్యూటింగ్, డ్రోన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ లాంటి భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన కోర్సులు సైతం ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనాసంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఉస్మానియా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. పూర్వవిద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరై తాము ఉస్మానియాలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. అష్ఫాక్ సయ్యద్, వినోజ్ చనమోలు, జకీ బసలత్, డా.. తాజమ్ముల్ హుస్సేన్, షేక్ అన్వర్ అహ్మద్, మహమ్మద్ సలీమ్, సలీమ్, డా. సురేష్ రెడ్డి, మోయిజ్ ఉద్దీన్, శ్రీని పాల్తేపు, ఆదిల్ సయ్యద్ సమావేశాన్ని సమన్వయం చేశారు.