Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ పుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి
నవతెలంగాణ-ధూల్‌పేట్
నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు లేకుండా చూడాలని తెలంగాణ పుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మెహిదీపట్నంలోని సర్కిల్-5 చౌకధరల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చుతో పేదల కోసం ఇస్తున్న నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయాలని, సమయ పాలన పాటించాలని డీలర్ సయ్యద్ ఖాధ్రీ ను ఆదేశించారు. సివిల్ సప్లై అధికారులు కూడా తరుచుగా రేషన్ షాపులను తనిఖీ చేయాలని సూచించారు. రేషన్ బియ్యం సక్రమంగా అందుతున్నాయా? సమయానికి రేషన్ షాపు తెరుస్తున్నారా లేదా అని లబ్దిదారులు వేణుగోపాల్, సుధాకర్ రావులను అడిగి తెలుసుకున్నారు. రేషన్‌బియ్యాన్ని లబ్దిదారులు ఉపయోగించుకోవాలని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోరాదని హెచ్చరించారు. తూకంలో ఎలాంటి అవకతవకలు చేయరాదని, రేషన్ షాపుల నిర్వహణలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉందని, డీలర్ కూడా మంచిగా పనిచేయాలని సూచించారు. తనిఖీలో స్థానిక సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్, నాంపల్లి డిప్యూటీ తహసీల్దార్ రాకేష్ పాల్గొన్నారు.