Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే ముఠా గోపాల్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆన్నారు. ఎమ్మెల్యే కేర్స్‌లో వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ పరిధిలోని చిక్కడపల్లి సుధా హోటల్ పక్క వీధిలో హెచ్ఎస్ఆర్ వసుధ అపార్ట్మెంట్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ అపార్ట్మెంట్ కల్చర్‌లో నివాసితులు ఉదయం తమ విధులకు వెళ్లి సాయంత్రం వస్తుంటారని, వారికి సమస్యలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు. అలాంటి వారి సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల స్కాన్ టు సాల్వ్ పేరిట ఎమ్మెల్యే కేర్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులతో ఇక్కడే సమావేశం నిర్వహించామని వివరించారు. ప్రధానంగా ఈఅపార్ట్ మెంట్లో ఎన్ఓసీ సమస్యతో పాటు, ఆస్తి పన్ను, దొంగల బెడద, డ్రయినేజీ, తాగునీటి సమస్యలు ఉన్నట్లు తమ దష్టికి వచ్చాయని చెప్పారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ట్యాక్స్ కమిషనర్ జాకీర్ హుస్సేన్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ దేవేందర్, వాటర్ బోర్డ్ డీజీఎం చంద్రశేఖర్, మేనేజర్ వేణుగోపాల్, బిల్ కలెక్టర్ సత్యనారాయణ, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజు. టీఆర్ఎస్ నేత ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మా నరేష్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్ కుమార్, మారిశెట్టి నర్సింగ్ రావు, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీష్, రవి శంకర్ గుప్త, అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు గోపాల్ భాను ప్రకాష్, త్రినాథరావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.