Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
నర్తకి కావాల్సిన భావాలు పలికించగల నేత్రాలు, పద ముద్రలలో మేలుకువలు ఆషా పూర్ణిమ నాట్య అరంగ్రేటం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. రవీంద్రభారతిలో నత్య ప్రియ ప్రముఖ నాట్య సంస్థ నిర్వ్యహణలో భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ నాట్య గురువు సరితా దిలీప్ శిష్యురాలు ఆషా పూర్ణిమ బాలాజీ కూచిపూడి, భరత నాట్య అరంగ్రేటం జరిగింది. ఆషా తొలి అంశంగా దైవ ప్రార్ధన వినాయక కౌతంను నర్తించి నర్తకులకు పరీక్ష వంటిడైన వర్ణం అంశంలో పద ముద్రలులో పరిణతి ప్రదర్శించారు. త్యాగ రాజ, అన్నమయ్య కీర్తనలలో ఆషా ప్రదర్శించిన అభివ్యక్తీకరణ ప్రేక్షకుల ప్రశంస అందుకొంది. నట్టువాంగం గురువు సరితా దిలీప్ చేయగా లావణ్య లత గాన సహకారం మధురం, మదంగ పై చంద్రకాంత్, వాయులీన పై అనిల్ కుమార్ సహకరించారు.