Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో ఫర్హీన్ షేక్
నవతెలంగాణ-హైదరాబాద్
అఫ్జల్‌సాగర్‌లోని 1200 గజాల భూనిధిలోని భూమితో పాటు రాంసింగ్ పురాలో ఇరువర్గాల మధ్య వివాదంగా ఉన్న15 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించి పూర్తి వివరాలతో హైదరాబాద్ ఆర్డీవోకు నివేదిక సమర్పించినట్టు ఆసిఫ్‌నగర్ ఎమ్మార్వో ఫర్హీన్ షేక్ తెలిపారు. గురువారం ఆసిఫ్ నగర్ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సదరు భూములకు సంబంధించిన వివాదాలు కోర్టులో నడుస్తున్నదనీ, అదే విషయాన్ని నివేదికలో తెలిపామన్నారు. వాస్తవాలను ఎక్కడా దాచలేదని స్పష్టం చేశారు. ఈ విషయాలకు సంబంధించి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.