Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రతి రోజూ చెత్త, మట్టి కుప్పులను తొలగిస్తూ శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని ప్రేమ్‌నగర్, దుర్గానగర్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై చెత్తా చెదారం పేరుకుపోయిందని ప్రతి రోజు చెత్తను తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లకు ఏర్పడ్డ గుంతలను వెంటనే పూడ్చాలన్నారు. కలుషిత నీరుశ్రీన, తాగునీటి పైపులైన్ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దుర్గానగర్‌లో నూతన పైపులైన్ నిర్మాణంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. అనంతరం దుర్గానగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీసీ వేణుగోపాల్, నోడల్ అధికారి హరీష్‌శంకర్, విద్యుత్ నాగరాజు, విద్యుత్ దీపాల అధికారి రమేష్. వర్క్ ఇన్స్పెక్టర్లు రమేష్, దుర్గ, టీఆర్ఎస్ నాయకులు సిద్ధార్డ్ ముదిరాజ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు.