Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
సుమన్ పలు చిత్రాల్లో ఆవేశం ఉట్టి పడే పాత్రల్లో రాణించినా ఆయన నటనకు పరాకాష్ట అన్నమయ్య చిత్రంలోని శ్రీవేంకటేశ్వరుడు పాత్ర అని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రవీంద్రభారతిలోని ప్రధాన వేదిక పై శతిలయ ఆర్ట్స్ అకాడెమీ, సెల్వెల్ కార్పొరేషన్, తిరుమల గ్రూప్, ఆర్ఆర్ ఫౌండేషన్ నిర్వహణలో భాషా సాంస్కతిక శాఖ సౌజన్యంతో నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నటుడు సుమన్‌కు నట భాస్కర పురస్కారంతో పాటు విఖ్యాత గాయకుడు ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ప్రముఖ గాయకుడు రాముకు గాన సమ్రాట్, గాయని మాళవికకు మధుర స్వర స్మిత బిరుదులతో సత్కరించారు. తెలుగుజాతి కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన ఎన్టీఆర్ సినీ రంగంలో ఎందరో నటులను పరిచయం చేసినట్లుగానే రాజకీయ రంగంలో పలువురు యువతను తెచ్చారని, వారు ఇప్పుడు రాజకీయాల్లో ప్రముఖులుగా వెలుగొందుతన్నారని అన్నారు. సినీ పాటలు నేడు వాయిద్య హోరుతో ఉన్న కొన్ని సందర్భాల్లో మంచి పాటలు వస్తున్నాయని మాళవిక రాము లను అభినందించారు. తిరుమల గ్రూప్ చైర్మెన్ ఎన్. చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన సభలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్, విజయ కుమార్, కళా పత్రిక రఫీ, రవికుమార్, నీరజ్ లక్హోతియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ సుస్వరాలలో భాగంగా అరు గంటలకుపైగా ప్రముఖ గాయని అమని,అఖిల, శ్రీనివాస్, సుభాష్, సిరి మధుర గీతాలను పాడి ఆకట్టుకున్నారు.