Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 24 గంటలు పోస్టుమార్టం సేవలు అందుబాటులో ఉంటాయని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు. చనిపోయిన వారి మతదేహాలకు పోస్ట్‌మార్టమ్ ప్రక్రియలు పూర్తి చేయడానికి ఇప్పటి నుంచి డిపార్ట్మెంట్ అఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికోలోజి వారు 24 గంటలు అందుబాటులో ఉండేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదివరకు వివిధ కారణాలతో చనిపోయిన వారి మతదేహాలకు సంబంధిత పోలీస్ శాఖ వారు పంచనామా అనంతరం పోస్ట్‌మార్టమ్ చేయడానికి వైద్యులు ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేవారన్నారు. సమయం మించిపోయిన తర్వాత వచ్చిన మతదేహాలకు మరుసటి రోజు ప్రక్రియ పూర్తి చేసేవారని చెప్పారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాలు, ఆదేశాల మేరకు ఇప్పటినుంచి మతదేహాలకు ఉస్మానియా ఆస్పత్రిలోని డిపార్ట్మెంట్ అఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికోలోజి విభాగం వారు పంచనామా అనంతరం పోస్ట్‌మార్టమ్ ప్రక్రియలు నిర్వహించి సంబంధిత అధికారులకు అప్పగించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటారనన్నారు. పోలీస్ శాఖ అధికారులు విభాగం వారి సేవలు సద్వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా ఏ సమయంలోనైనా పోస్ట్‌మార్టమ్ చేసి అనంతరం వారి కుటుంబసభ్యులకు మతదేహాన్ని అందించవచ్చునని వివరించారు. డెడ్‌బాడీలను గమ్యస్థానాలకు తరలించేందుకు ఉచిత రవాణా సౌకర్యం (పార్థీవ వాహనం) కోసం 040-24600146/604, 9849902977 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.