Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాస ప్రాంతాలకు క్షేత్రస్థాయిలో పర్యటించి క్రమబద్ధీకరణ చేపట్టాలి
- ఇప్పటివరకు 38 వేల దరఖాస్తుల స్వీకరణ
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ జీవో 58 ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారి ఇండ్ల పరిశీలన ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీవో 58పై జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, మండల ప్రత్యేక అధికారులు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ జీవో 58 ప్రకారం జిల్లా వ్యాప్తంగా అర్హులైన లబ్దిదారులకు సంబంధించి ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు ముందు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జీవో 58 క్రమబద్ధీకరణపై తగు సూచనలు సలహాలు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. ఇండ్ల పరిశీలనకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ ఉండాలని సూచించారు. అనంతరం నిర్మించుకున్న ఇంటిని ఫొటో తీసి అప్లోడ్ చేయాలని, అవి జీవో నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేదా అనే విషయాలను వెరిఫికేషన్ చేయాలని వివరించారు.
జిల్లావ్యాప్తంగా 60 టీమ్లు
ఇండ్ల పరిశీలన, క్రమబద్దీకరణకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 60 టీమ్లను నియమించామని, ఇప్పటి వరకు 38 వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియను సులువుగా పూర్తి చేసేందుకుగాను మెదక్ జిల్లా నుంచి ప్రత్యేక అధికారుల బందం కూడా రానున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలకు కలెక్టర్ హరీశ్ సమాధానాలిచ్చి వారి సందేహాలను నివత్తి చేశారు. క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు, సూచనలు ఉల్లంఘించరాదన్నారు. బందంలోని సభ్యులందరూ కలిసి పని చేస్తే సులువుగా ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులతో పాటు ఆయా మండలాల సర్వేయర్లు, డిప్యూటీ తహసఅల్దార్లు, ప్రత్యేక అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.