Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
నవతెలంగాణ-ఓయూ
రాష్ట్రాభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని అంబర్‌నగర్, సంజరు గాంధీనగర్, ఈశ్వరీబాయి నగర్, వారాసిగూడ, బాలవాడి స్కూల్, కౌసర్ మసీద్, మార్కండేయ టెంపుల్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, అధికారులతో కలిసి విస్తతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బౌద్ధనగర్ను సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. వివిధ అభివద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంక్ కాలనీ పార్క్‌ను అభివద్ధి చేయాలని అధికారులకు సూచించారు. నాలా, కౌసర్ మసీద్ సమీపంలో రోడ్డు సమస్యపై స్థానికులతో వెంటనే సంప్రదించి, వారి అభీష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని డీసీ దశరథ్, జలమండలి జనరల్ మేనేజర్ రమణా రెడ్డి లను ఆదేశించారు. అనంతరం రూ. 31 లక్షలతో నిర్మించిన కొత్త రహదారిని ప్రారంభించారు.కార్యక్రమంలో అధికారులు ఆశాలత, వై కష్ణ, ప్రియాంక, శశిధర్, టీఆర్ఎస్ యువనేతలు కిశోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కంది. నారాయణ పాల్గొన్నారు.