Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట భారత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా తుంగ బాలు మాట్లాడుతూ తన అనుచరులకు, మిత్రులకు దేశాన్ని కట్టబెట్టిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరిపాలన చాలా దుర్మార్గం అని మండిపడ్డారు. శ్రీలంకలోని రూ.5 వేల కోట్ల పవర్ ప్రాజెక్టును ఆదాని కంపెనీకి దొడ్డిదారిన అప్పగించేలా చేశారని ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మెన్ స్వయంగా వెల్లడించారని చెప్పారు. మోడీ ఎనిమిదేండ్ల పాలనలో అనేక రంగాల్లో అభివద్ధికి ఆమడ దూరంలో దేశాన్ని నెట్టడం చాలా దుర్మార్గం అన్నారు. ప్రపంచ దేశాల ముందు భారత్ తన దిగజారుడు రాజకీయాలు చేస్తుందని దేశ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఆయన వ్యవహారం ఉందని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ తన తప్పులను ఒప్పుకొని వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోతి విజరు, ఆవాల హరిబాబు, రమేష్ ముదిరాజ్, శశిపాల్, వెలుపుకొండ వెంకట్, కాటం శివ, కొంపల్లి నరేష్, నాగరాజు, సంపత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.