Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్ మెట్
అగ్నిపథ్ దేశ భద్రతకు ముప్పు అనీ, కాంట్రాక్ట్ పద్ధతిలోలో సైనికుల నియామకం వద్దే వద్దు అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్ల పెళ్ళి అంజి శనివారం తెలిపారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ పథకం ద్వారా మిలటరీ ఉద్యోగాల ఎంపిక పరీక్ష కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. నాలుగేండ్లు విధులు నిర్వహించిన ఆర్మీ సైనికులు 75శాతం నిరుద్యోగులు అవుతారని తెలిపారు. దేశ రక్షణ సంక్షోభ సమయంలో కేవలం శిక్షణ గల నూతన సైనికులతో పాటు అనుభవజ్ఞులైన సైనికులు ఉండాలని అని ఎన్నోసార్లు రుజువైందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అగ్నిపత్ పథకం వ్యతిరేక ఉద్యమాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయాలని కోరారు.