Authorization
Fri March 21, 2025 06:54:44 pm
నవతెలంగాణ-నేరెడ్ మెట్
మౌలాలి డివిజన్ మారుతినగర్ హిమాలయా టవర్స్ నుంచి భరత్ నగర్ వరకు, లక్ష్మీనగర్, ప్రగతి నగర్ ఏరియాల్లో రూ.75 లక్షలతో ఆర్సీసీ పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు శనివారం ప్రారం భించారు. అనంతరం పట్టణ ప్రగతి చివరి రోజులో భాగం గా మారుతి నగర్, గ్రీన్ హిల్స్ కాలనీల్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. గ్రీన్‌హిల్స్ కాలనీలో పెండింగ్ రోడ్లు, కమ్యూనిటీ హాల్, ఎలక్ట్రికల్ పోల్స్ వాటర్ సమస్య తదితర సమస్యలు పరిష్కరించాలని కాలనీవా సులు ఎమ్యెల్యేను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్‌గౌడ్, ఆమిను ద్దీన్, జీఎన్వీ సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, భాగ్య నంద్ రావు, సత్తయ్య, మంద భాస్కర్, జగదీష్ యాదవ్, ఆదినా రాయణ ఇబ్రహీం, సాదిక్, బుద్ధి నర్సింగ్‌రావు, మోహన రెడ్డి, సంతోష్ రాందాస్, సందీప్ గౌడ్ పాల్గొన్నారు.