Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో జరిగిన ఘటన దురదృష్టకరం అని హైదరబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి అన్నారు. శనివారం తార్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాకేష్ మృతికి కేంద్రమే భాద్యత వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన దుర్మార్గపు విధానం వల్ల బలైపోయిన యువకులను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన రాకేష్ కుటుం బానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్య ఉద్యో గం కల్పిస్తా అని ప్రకటించడం హర్షణీయం అన్నారు. నల్ల చట్టాలతో రైతులను ఇబ్బందు లకు గురిచేసిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరే జవాన్లను అంధ కారంలోకి నెట్టారని తెలిపారు. చనిపోయిన రాకేష్ కుటుంబంలోని వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి పాల్గొన్నారు.