Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
పట్టణ ప్రగతి కార్యక్రమంలో సహకరించిన వివిధ శాఖల అధికారులు, ఆయా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులను శనివారం సాయినగర్ సుమంగళి ఫంక్షన్ హాల్లో కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సన్మానించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్, అధికారులతో కలిసి నిర్వహించారు. కాలనీల్లో రోడ్లు, డ్రయినేజీ, మంచినీరు, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, కమ్యూనిటీ హాల్, తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. న్యూ వెంకటేశ్వర నగర్లో రూ.22 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, మల్కాజిగిరి సర్కిల్ డీసీ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దివ్య జ్యోతి, జలమండలి జీఎం సునీల్ కుమార్, డీజీఎం శ్రవంతి, డీసీపీ గజానంద్, తుల్జాసింగ్, ఎలక్ట్రికల్ ఏఈ సుదీప్ రెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్ మనోహర్ రెడ్డి, నాగరాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, నాయకులు, కార్యకర్తలు, స్థానిక కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.