Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హరితహారం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 'మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా' అనే అంశంపై వర్క్ షాప్ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో యోగా నిపుణులు డాక్టర్ వై.మార్కండేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుకన్య మాట్లాడుతూ ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు. ఇందుకు అందరూ నియమిత సమ యంలో ప్రతిరోజూ 40 నిమిషాలు యోగాసనాలు అభ్య సించాలని సూచించారు. డాక్టర్ మార్కండేయ విద్యార్థు లకు ఆరోగ్య సూత్రాలు వివరిస్తూ, ప్రాణాయామ పద్ధతు లను చేసి చూపించారు. రోజువారీ అభ్యాసానికి కొన్ని సరళమైన ఆసనాలు అందరిచేత వేయించారు. కళాశాల నుంచి తృతీయ సంవత్సరం విద్యార్థి నరేశ్, ప్రథమ సంవత్సరం విద్యార్థులు శంకర్, హేమలత కొన్ని కఠినమైన ఆసనాలు, సూర్య నమస్కారాలు ప్రదర్శించారు. ఈ కార్యక్ర మంలో వైస్ ప్రిన్సిపాల్స్ అనితా అబ్రహం, బంగ్లా భారతి, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.చిన్న బాబు, ఫిజికల్ డైరెక్టర్ ఇ.నర్సింగరావు, హరితహారం కన్వీనర్ ఎస్.రవి ప్రసాద్, అధ్యాపకులు ఎస్.నిర్మల, పి.వెంకట ఈశ్వర్, డాక్టర్ ఎల్.శ్రీనివాస రావు, డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ యాదవ్, డాక్టర్ అవినాశ్ రాజె, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్. వాలంటీర్లు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.