Authorization
Wed March 19, 2025 03:46:14 am
నవతెలంగాణ-అడిక్ మెట్
ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్ వ్యాప్తంగా మంచినీటి సరఫరాలో ప్రెషర్, సివరేజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. శనివారం జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్, మేనేజర్ వేణుగోపాల్ నాయు డుతో కార్పొరేటర్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. అనంతరం కార్పొరేటర్ పావని మాట్లాడుతూ నీటి సరఫరా సమస్య ఎక్కడ నుంచి ఏర్పడుతుంది అన్నదానిపై ఆరా తీశామని తెలిపారు. లో ఫ్రెషర్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు ఎక్కడ మంచినీటి డ్రైనేజీ, ఓవర్ ఫ్లో లాంటి సమస్యలు ఏర్పడినా తమ కార్పొరేటర్ కార్యాలయం నెంబర్ 7799819991కు సంప్రదించాలని కోరారు. వెంటనే సమస్యను సంబంధిత అధికారుల సాయంతో పరిష్కరిస్తామని హామీనిచ్చారు.