Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రూ. 5.46 కోట్లతో చేపట్టిన 5 అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొ రేటర్ స్వర్ణ రాజు శంకుస్థాపన చేశారు. ఈ సంద ర్భంగా కాప్రా వల్వార్ నగర్ లో బాక్స్ డ్రైన్ మర మ్మత్తులు స్ట్రామ్ వాటర్ డ్రైన్ రీ-మోడలింగ్ పనులకు మరమ్మతులు, రూ.115 లక్షలతో చేపట్టిన నిర్మల్ నగర్ నుంచి రెయిన్బో కాలనీ గ్రేవ్ యార్డ్ వరకు బాక్స్ డ్రైన్ మరమ్మత్తులు పనులకు, రూ.269 లక్షలతో కంది గూడా మాణిక్ సాయి ఎంక్లేవ్ నుంచి డీఎల్ఆర్ ఎంక్లేవ్ కాలనీ వరకు, సీసీ రోడ్డు, బీటీ రోడ్డు మరమ్మతులు సాయిబాబా ఆఫీసర్స్ కాలనీలో, సీసీ రోడ్డు, బీటీ రోడ్డు మరమ్మతులు, సాయిబాబా నగర్ కాలనీలో బీటీ రోడ్డు మరమ్మతులు. రూ. 62.3 లక్షలతో మైత్రి ఎంక్లేవ్ కాలనీలో పట్టణ ప్రగతిలో భాగంగా సాయిబాబా నగర్లో పర్యటించి అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లా డుతూ పట్టణ ప్రగతి దేశంలోనే ఆదర్శంగా నిలు స్తుందన్నారు. రెండేండ్ల క్రితం కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారనీ, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న మున్సిపాలి టీల్లో సుమారు రూ.వెయ్యి కోట్లతో డ్రెయిన్ల పునరుద్దరణ, బాక్స్ కల్వర్టుల నిర్మాణం చేపట్టి ఎంత పెద్ద వర్షం వచ్చినా తట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తమ వంతు బాధ్యతగా నాలాలు, రోడ్లు, డ్రయినేజీ సమస్యను అధిగమించేందుకు పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఈ.అశోక్ రెడ్డి, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిలాల్, ఎఈ. అభిషేక్, ఎల్.బి నగర్ యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ జి.రాజ్ కుమార్, మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ధన్పాల్, కాప్రా డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్, పవన్, మచ్చ పాండు గౌడ్, రేగుళ్ళ సతీష్ రెడ్డి, శ్రీనివాస్, మల్లారెడ్డి, భిక్షపతి, చంద్రశేఖర్ గణేష్, రాజు, మహిళలు శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.