Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కుషాయిగూడలోని శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో యూనిఫామ్స్, బుక్స్ దందాలు ఆపాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు స్పందించిన ఎంఈఓ శశిధర్ వచ్చి నారాయణ విద్యా సంస్థ యూనిఫామ్స్, బుక్స్ రూమ్స్‌ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి సంతోష్ మాట్లాడుతూ శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలు యూనిఫామ్స్, పుస్తకాల పేరుతో రూ.5-10వేలు వసూలు చేస్తున్నా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సీబీఎస్సీ సిలబస్ పేరిట రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 91లోసెక్షన్ 1 ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజ మాన్యం సూచించే చోటే కొనాలన్న ఖచ్చితమైన నిబంధ నలేమీ లేదన్నారు. వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదనీ, విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చు అని విద్యా హక్కు చట్టం చెబుతుంటే ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు మాత్రం ఏకంగా పాఠశాలల్లోనే పుస్తకాలు, యూనిఫాం అమ్మడం సరికాదన్నారు. ఇప్పటికైనా విద్యాధికారులు స్పందించి అధిక ఫీజులతోపాటు పుస్తకాలు, యూనిఫాం అమ్మకంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో డీఈఓ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ ఉప్పల్ అధ్యక్షుడు ఖాషిం జాలం, ఎస్ఎఫ్ఐ కాప్రా ఇన్చార్జి సాయి ఉత్తేజ్, ఎస్ఎఫ్ఐ కాప్రా నాయకులు వెంకట, సాయి, నవీన్, విజరు, భాస్కర్, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.