Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
- గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల శిక్షణా తరగతులు ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్
జర్నలిస్టుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై స్వయంగా మీడియా అకాడమీకి వచ్చి చర్చించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో మీడియా అకాడమీ ఆధ్వ ర్యంలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల శిక్షణా తరగతులు శనివారం ప్రారంభయ్యాయి. ఈ కార్యక్రమానికి అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథులుగా హజరై, జ్యోతి ప్రజ్వ లన చేసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం రూ.42 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా వచ్చిన రూ.16 కోట్ల వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. ఇందులో చనిపోయిన 490 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, ఆ కుటుంబాలకు ప్రతినెలా రూ.3 వేల పెన్షన్, పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించినట్టు వివరించారు. ప్రమాదాల కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్న 122 మందికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశామన్నారు. కోవిడ్ బారిన పడ్డ 4 వేల మంది జర్నలిస్టులకు ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు. హెల్త్ కార్డులు పటిష్టంగా అమలయ్యేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. జర్నలిజంలో విలేకర్లు మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి అనుభవజ్ఞులైన జర్నలిస్టుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గంలోని శాసన సభ సభ్యులు తమ పరిధిలోని స్థానిక విలేకర్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముషీ రాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలతోపాటు జర్నలి స్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తులిపారు. సామా జిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల జర్నలిస్టులకు ఎప్పటి కప్పుడు మరింత అవగాహన పెంచుకోవడానికి శిక్షణా తరగతులు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కార్య క్రమంలో మీడియా అకాడమీ సెక్రెటరీ ఎన్.వెంకటేశ్వర్ రావు, మేనేజర్ వనజ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టెంజూ అధ్యక్షులు ఇస్మాయిల్, టీయూడబ్ల్యూజే నగర అధ్యక్షులు పి.యోగానంద్, ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.