Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
ఆర్మీ నియామకాల్లో నూతనంగా ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పధకం ద్వారా నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం వాటిల్లుతుందనీ, ఈ పథకం కారణంగా మంచి కంటే చెడే ఎక్కు జరిగే ప్రమాదం ఉందని అఖిల భారత యువ జన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేడ్చల్ జిల్లా సమితి కార్యాల య కూడలి వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సత్య ప్రసాద్, ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చందు, రాజు, నవీన్, విజరు, పవన్, ప్రసాద్, మహేష్ కుమార్, రాకేష్, ప్రదీప్, కిరణ్మయి, రంజిత, ఫాతిమా, స్వాతి, జరీనా పాల్గొన్నారు. వీరిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఓయూ : కేంద్ర ప్రభుత్వం తొందరపాటుతో, అనాలోచితంగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని విద్యార్థి జన సమితి, యువజన సమితి రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. శనివారం ఓయూ ప్రధాన గేటు వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేస్తున్న విద్యార్థి, యువజన సమితి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా పోలీసులు, నాయకుల మధ్యన తోపులాట జరిగింది. పోలీసులు కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను చిన్నాభిన్నం చేశారు. దీంతో యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలీంపాష, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబూ మహాజన్, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్కు గాయాలయ్యాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పేరాల ప్రశాంత్, విద్యార్థి నాయకులు రమేష్ యాదవ్, జీవన్, డప్పు గోపి, శేఖర్ యావ్, నాయకులు వెంకట్, రాజేష్, హరిభూషణ్, సతీష్, సురేష్, పాల్గొన్నారు.