Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ను తన కార్యాలయంలో సోమవారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆర్ కె నగర్, విష్ణుపురి ఎక్స్ టెన్షన్, ఎల్బీనగర్, బాల సరస్వతి నగర్, తదితర కాలనీల్లో రోడ్స్, డ్రయినేజీ, మల్కాజిగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్, తదితర పెండింగ్లో ఉన్న పనులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. కావాలని పనులు అడ్డుకున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని, డివిజన్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.