Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
జూబ్లీహిల్స్ డివిజన్లోని ప్రధాన రహదారులపై మురుగు నీరు వరదల ప్రవహిస్తుంది. వారం పదిహేను రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొన్న అధికారులు గాని సంబంధిత కాంట్రాక్టర్ గానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కష్ణానగర్ ప్రధాన రహదారి కష్ణా నగర్ నుంచి వయ శ్రీనగర్ కాలనీ పంజాగుట్ట మార్గం రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. వందల మంది ప్రయాణించే ఈ రహదారిలో వ్యాపారులు కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. నిత్యం మురుగుతో నరకయాతన అనుభవిస్తున్న మని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల కిందట వేసిన రహదారులతో బస్తీవాసులు పడుతున్న ఇక్కట్లు అంతా ఇంతా కాదని అభిప్రాయపడ్డారు. ఎన్నిసార్లు అడిగినా పనులు జరుగుతున్నాయి సహకరించండి కోరడం తప్పా పనులు పూర్తికావు రహదారిపై మురుగు ఆగదు అన్నట్లే పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు మురుగునీరులో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు వెళుతున్న ప్రజల గోస పట్టణ అంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.