Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రియేటివ్ డిజిటల్ మార్కెంటింగ్ సంస్థ
నవతెలంగాణ-బంజారాహిల్స్
మూడేండ్ల కిందట ముగ్గురితో మొదలైన ఈ క్రియేటివ్ డిజిటల్ మార్కెంటింగ్ సంస్థ నేడు 40మందికి ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందని వీఆర్ వెరీ ఇన్ సంస్థ వ్యవస్థాపకులు సాయి బత్తిన, చైతన్య కొడుమూరి, అనిల్‌కుమార్ బల్ల తెలిపారు. ఎమినెంట్ 2022లో బెస్ట్ ఇనోవేటివ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీగా అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తంచేశారు. ఆదివారం శ్రీనగర్ కాలనీలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలోని రాడిసన్ బ్లూలో పీఆర్ 360 ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తమ కంపెనీకి బెస్ట్ ఇన్నోవేటివ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీగా అవార్డు వచ్చిందని, గతేడాది గ్లోబల్ ఐకాన్ అవార్డు కూడా వచ్చిందన్నారు. సజనాత్మకత,కొంగొత్త ఆలోచనలు ఉంటే డిజిటల్ రంగంలో రాణించవచ్చు అని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధితో పాటు సామాజిక సేవలు చేయడమే తమ కంపెనీ లక్ష్యమన్నారు.