Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా : వికలాంగులు, వృద్ధులకు ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాల పంపిణీ కోసం అర్హుల ఎంపిక శిబిరంను సీనియర్ సిటిజెన్ బిల్డింగ్, ఏఎస్రావు నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అడిషనల్ కమిషనర్ శృతి ఓజా, జోనల్ కమిషనర్ పంకజ, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, కార్పొరేటర్లు స్వర్ణరాజ్, శిరీష సోమ శేఖర్ రెడ్డి, బొంతు శ్రీదేవి, ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జెన్ శేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవా లన్నారు. ఈ శిబిరంలో అర్హులను గుర్తించి వారికి కావాల్సిన కొలతలతో ఉచిత ఉపకరణాలు, సహాయ పరికరాలు తయారీ చేసి మరల ఇదే వేదికలో ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిలాల్, ఉష, స్వప్నరెడ్డి, కృష్ణ, సిబ్బంది, ప్రెసిడెంట్ ఊర్మిల, ఆసరా కమిటీ రావు నగర్ ప్రెసిడెంట్ రావు, వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.