Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్ నగర్
హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల పరిధిలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలల పేరుతో ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారనీ, దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి శివ పేర్కొన్నారు. సోమవారం రెండు మండలాల్లోని ప్రయివేటు పాఠశాలల్లో పుస్తకాల విక్రయాల తీరును పరిశీలించామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్ఛల విడిగా పుస్తకాలు అమ్ముతుంటే తమకు సంబంధం లేనట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. ఫస్టు క్లాస్‌కే విద్యార్థుల నుంచి రూ.5 వేలు పుస్తకాల కోసం వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి పాఠశాలలపై ఎంఈఓలు, డీఈఓలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.