Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహ్మ రెడ్డి, డీఈఓ విజయ కుమారిలకు సోమవారం మేడ్చల్ కలెక్టరేట్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సంతోష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామంతపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నుంచి హెడ్మాస్టర్ సాంబయ్య, స్వరూపరాణి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనీ, వారిని సస్పెండ్ చేయాలని కోరారు. నూతనంగా అడ్మిషన్ అవుతున్న విద్యార్థుల నుంచి తెలుగు మీడియం విద్యార్థుల అడ్మిషన్ ఫీజు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం విద్యా ర్థులకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారనీ, టీసీ, బోన ఫైడ్కు రూ.500 చెల్లిస్తేనే ఇస్తామనే కండిషన్తో వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో డబ్బులు చెల్లించలేక ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ అవు తున్న స్టూడెంట్ల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడంతో అడ్మిషన్ కాకుండా గందరగోళంలో విద్యార్థులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డబ్బులు చెల్లించాలా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే డబ్బు లు చెల్లిస్తేనే అడ్మిషన్ అవ్వండి లేకపోతే లేదు అని చెప్పేసి హెడ్మాస్టరు హెచ్చరికలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండి స్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన విద్యార్థులకు చదువు చెప్పాల్సిన హెడ్మాస్టర్ లంచాలకు పాల్పడితే పై అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఉప్పల్ జోన్ కార్యదర్శి శ్రీనివా స్, నాయకులు బాపట్ల కృష్ణమోహన, ఎస్ ఎఫ్ఐ ఉప్పల్ మండల కార్యదర్శి మణికంఠ, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, బల్లెం గౌతం, సాయి కిరణ్, నవీన్ పాల్గొన్నారు.