Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీ, డిగ్రీ కళాశాలల సమన్వయ లోపంతో తాము నష్టపోతున్నామని విద్యార్థులు ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. పి.లక్ష్మీనారాయణ, కంట్రోలర్ శ్రీనగేష్ లకు వినతిపత్రాలు అందజేశారు. ఓయూ పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలతో యూనివర్సిటీకి టెక్నీకల్ ప్రాబ్లమ్ వల్ల సమన్వయ లోపంతో జరిగిన తప్పిదాలతో దాదాపు 1500 వందల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి గల కారణాలను విద్యార్థి నాయకులు ఆరా తీయగా యూనివర్సిటీ యాజమాన్యం కళాశాల తప్పిదం అని కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ టెక్నీకల్ ప్రాబ్లమ్ అని ఒకరిపై ఒకరు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను వీసీ దృష్టికి తీసుకెళ్లి నష్టపోతున్న విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలోలో విద్యార్థి నాయకులు నిజ్జన రమేష్, తాళ్ల అజయ్ మహరాజ్, సుమంత్, శరత్ నాయక్, బోరెల్లి సురేష్, మిథున్ ప్రసాద్ పాల్గొన్నారు.