Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
డిపార్ట్మెంట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (ఎమ్సిజె), మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎమ్ఎఎన్యూయూ), యూనిసెఫ్‌తో కలిసి నిర్వహించిన ఎవిడెన్స్ బేస్డ్ హెల్త్ జర్నలిజంపై రెండు రోజుల వర్క్‌షాప్ సోమవారంతో ముగిసింది. ఎమ్ఎఎన్యూయూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎమ్‌సి), హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ నుంచి 120 మంది జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులు, హెల్త్ జర్నలిస్టులు హెల్త్ జర్నలిజంలో ఎవిడెన్స్ బేస్డ్ రిపోర్టింగ్, ఫ్యాక్ట్-చెకింగ్ ప్రాముఖ్యతను యూనిసెఫ్ క్రిటికల్ అప్రైజల్ స్కిల్స్ (సిఎఎస్) ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్నారు. వర్క్‌షాప్ ససీఎఎస్ ప్రాక్టీషనర్లు, జర్నలిజం విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులను కలిసి రొటీన్ ఇమ్యున్కెజేషన్, కోవిడ్-19, వ్యాక్సిన్లు, యాంటీబయాటిక్స్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్, ప్రైమరీ హెల్త్‌కేర్ వంటి పిల్లలపై ప్రభావం చూపే అంశాలలో ఎవిడెన్స్-బేస్డ్ జర్నలిజం ప్రాము ఖ్యత గురించి చర్చించారు. ఎమ్ఎఎన్యూయూ, వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ ''కొవిడ్ మొత్తం ప్రపంచ దృష్టిని హెల్త్ కమ్యూనికేషన్ ప్రాము ఖ్యత వైపు నడిపించేలా చేసింది. రోగనిరోధకత కోసం డిమాండ్‌ను సృష్టించడంలో మీడియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. అయినప్పటికీ, జర్నలిస్టులలో చాలా మంది వైద్యేతర నేపథ్యం నుంచి వచ్చినందున, విద్యా స్థాయిలో సీిఎఎస్ను ప్రవేశపెట్టడం వల్ల జర్నలిస్టులకు హెల్త్ జర్నలిజంలో శిక్షణ ఇవ్వడంలో, ప్రజలలో శాస్త్రీయ ఆలోచనను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది'' అని తెలిపారు. యునిసెఫ్ ఇండియా చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్, అడ్వకేసీ అండ్ పార్ట్నర్షిప్స్ జఫ్రిన్ చౌదరి మాట్లాడుతూ, ''యునిసె ఫ్ చాలా కాలంగా మీడియాతో కలిసి అభిప్రాయాలను పెంపొందించడంలో ప్రజలను ప్రభావితం చేయ డంలో కీలక పాత్రను పోషిస్తున్నది. క్రిటికల్ అప్రైసల్ స్కిల్స్ కోర్సు (సిఎఎస్) 2014లో మీడియా నిపుణుల లో ఖచ్చితమైన, సమతుల్యమైన, విశ్లేషణాత్మకమైన రిపోర్టింగ్‌ను, తప్పుడు సమాచారం నుంచి రక్షించడా నికి వాస్తవ తనిఖీ కోసం నైపుణ్యాలను బలోపేతం చేయడానికి అభివృద్ధి చేయబడింది. రోగనిరోధకత వంటి పిల్లలను ప్రభావితం చేయగల సమస్యలపై ఖచ్చితమైన, విశ్వసనీయమైన మీడియా నివేదికలను పెంచడం, తల్లితండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించడానికి అవసరమైన సరైన సమాచారం, విశ్వా సాన్ని అందించడం, నివారించగల బాల్య వ్యాధుల నుంచి వారిని రక్షించడం అనేది ఆలోచన'' అని వారు తెలిపారు.