Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్-మల్కాజిగిరి అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్
కలెక్టరేట్లో ప్రజావాణి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను గుర్తించి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, విజ్ఞప్తులను పెండింగులో ఉంచకుండా చూడాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగయ్య నాయక్తో కలిసి విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ దరఖాస్తుదారులు ఇచ్చిన విజ్ఞప్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలను సైతం వారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి తమ సమస్యలు తీరుతాయని నమ్మకంతో ప్రజావాణికి విజ్ఞప్తులు ఇచ్చేందుకు వస్తారనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అర్జీ చేసుకున్న వారి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జనరల్ బాడీ అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో మొత్తం 78 దరఖాస్తులు రాగా వాటిని అదనపు కలెక్టర్లు సంబంధిత అధికారులకు పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగయ్య నాయక్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.