Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ డాక్టర్ కేపీ శ్రీనివాస్ రావు
నవతెలంగాణ-బడంగ్పేట్
ఇంజినీరింగ్ విద్యార్థులు పారిశ్రామిక రంగంలో రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మెన్ డా.కేపీ శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న నాదర్గుల్లోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల ఎంవీఎస్సార్లో ఎంటర్ ప్రెన్యూర్షిప్ డవలప్ మెంట్ సెల్ (ఈడీసీ) ఆధ్వర్యంలో విద్యార్థులకు పారిశ్రామికాభివద్ధిపై సదస్సును నిర్వహించారు. మాత్రశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మెన్ డా.కేపీ శ్రీనివాస్ రావు, డా. సుష్మితా సుందర్, హెడ్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, వైఎస్సార్ రాజీవ్ కుమార్, మెంటర్, టీ-హబ్ అండ్ డైరెక్టర్, వెల్ స్ప్రింగ్ కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్, విజరు కిరణ్, కో-ఫౌండర్ అండ్ సీఈఓ, నెక్స్ట్ జెన్ లెర్నింగ్ అండ్ కన్సల్టింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే నాయకత్వ లక్షణాలను అభివద్ధి చేసుకోవాలని, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి పునాది వేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.కనకదుర్గ, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ. యస్జీయస్ మూర్తీ మాట్లాడుతూ విధ్యార్థిదశలోనే స్టార్టప్‌లను నిర్వహించాలని తదనంతరం పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశాలుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ చీఫ్ కోఆర్డినేటర్‌గా ప్రొ ఎస్జీఎస్ మూర్తి, కోఆర్డినేటర్, ఆటోమోబైల్ హెచ్ఓడీ, డా. శ్రీనివాస్ శర్మ, ఉపన్యాసకులు విద్యార్థులు తదితరులు పాల్గన్నారు.