Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
దళిత క్రైస్తవ హక్కుల కోసం ఆల్ ఇండియా క్రిష్టియన్ ఫెడరేషన్ ( ఏఐసీఎఫ్ ) 26 ఏండ్లుగా చేస్తున్న అవిశ్రాంత పోరాటం అభినందనీయమని అంతర్జాతీయ ప్రసంగీకులు పి.ఐజాక్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్లోని అమతవాణిలో ఏఐసీఎఫ్ 26వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి నిర్వహించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హౌదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హౌదా కల్పిస్తామని ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరారు. దళితులు, దళిత క్రైస్తవులు అంతర్గత విబేధాలను విడనాడి ఐకమత్యంతో న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయాలని సూచించారు. 26 ఏండ్లుగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హౌదా కల్పించేందుకు ఏఐసీఎఫ్ అన్ని విధాలు పోరాటాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించి వారి పోరాట స్ఫూర్తిని అభినందించారు. ఈ కార్యక్ర మంలో ఐజాక్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గద్దపాటి విజయరాజు, తెలంగాణ అధ్యక్షులు డేవిడ్ కడారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శామ్యుల్, కో-ఆర్డినేటర్ గిడియోన్ బాబు, జయశ్రీ టైటస్, పాస్టర్ ప్రవీణ్ కుమార్, వనిత అలెగ్జాండర్ పాల్గొన్నారు.