Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు యోగా కార్యక్రమాలను ప్రారంభించారు. యోగాసనాల్లో పాల్గొని యోగవల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
నవతెలంగాణ-కూకట్పల్లి
జగద్గిరిగుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సౌజన్యంతో అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని ఆలయ ప్రాంగణంలో శివశక్తి ధ్యాన యోగా గురువు కౌడ మల్లేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రమశక్తి అవార్డు గ్రహీత, కార్మిక నాయకుడు ముద్దాపురం మదన్‌గౌడ్ పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మెన్ ప్రవీణ్ కుమార్ గుప్తా, రమేష్ గుప్తా, నరేందర్ గుప్తా, స్వామి గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు కూకట్పల్లి రాజధాని స్కూల్ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సరూర్ నగర్ : యోగ ప్రశాంతమైన జీవనానికి, ఆరోగ్యకరమైన జీవనశైలికి సాధనమని కేవీఐసీ దక్షిణ భారతదేశ అధ్యక్షుడు పేరాల శేఖర్‌రావు అన్నా రు. యోగా దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో పాఠశాల, కళాశాలల విద్యార్థులు, సిబ్బంది, క్రీడాకారులు, వాకర్స్ నిర్వహించిన యోగా దినోత్సవంలో వదారు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్ యాదవ్, సహ కార్యదర్శి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా క్రీడల అభివద్ధి అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి శైలేంద్రరావు, స్యాట్ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగోల : యోగా, ధ్యానం మానసిక ఉత్సాహానికి ఎంతో ఉపయోగ పడతాయని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి, సీనీయర్ సివిల్ జడ్జి ఎ.శ్రీదేవి అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంగళవారం నాగోల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యోగా టీచర్ వనజ, ఫారా లీగల్ వాలంటీర్, లైట్ ఫౌండేషన్ సభ్యులు శ్యామలాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..
కూకట్పల్లి : కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని, ఎస్ఎస్డి గ్రామర్ హైస్కూల్ అండ్ కిడ్జ్ ఆన్ క్రేయన్స్ స్కూల్లో పాఠశాల కరెస్పాండెంట్, బీజేపీ సీనియర్ నాయకులు సురభి రవీందర్ రావు, స్కూల్ డైరెక్టర్, బీజేపీ అనుబంధ మహిళా బోర్చ జిల్లా ఉపాధ్యక్షు రాలు చెన్నమనేని స్రవంతి పాఠశాల విద్యార్థులు, టీచర్లతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
బడంగ్పేట్ : యోగాతో ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ చోట్ల యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నాదర్గుల్, బడంగ్పేట్, బాలాపూర్, అల్మాస్గూడ, గుర్రంగూడ, మల్లాపూర్, మామిడి పల్లి గ్రామాలలో యోగా దినత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకు లు కొలను శంకర్ రెడ్డి, చెరుకుపల్లి వెంకట్ రెడ్డి, గుర్రం మల్లారెడ్డి, ఏనుగు రామ్ రెడ్డి, నడికుడి యాదగిరి, కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, గూడెపు ఇంద్రసేన, రామోజీ శ్రీశైలం చారి,దడిగె శంకర్, నాయకులు నిమ్మల రవికాంత్ గౌడ్, జక్కిడి జంగారెడ్డి, జోరల ప్రభాకర్, మంత్రి మహేశ్, ఆర్. రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
సరూర్‌నగర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెయింట్ జేవియర్ పాఠశాలలో ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మెన్ హిస్కీ, తదితరులు పాల్గొన్నారు.
కెబీహెచ్బీ : క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ అనేక దీర్ఘకాలిక రోగాలను దరిచేరకుండా రక్షణ పొందవచ్చునని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్య క్షుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అంతర్జా తీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నిజాంపేట్ రోడ్‌లోని శ్రీ శ్రీ హౌలిస్టిక్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన యోగా దినోత్స వంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్ర మంలో 108 సర్వీస్ ఫౌండర్, సీఈఓ వెంకట్ చెంగవల్లి, హౌలిస్టిక్ ఆసుపత్రి చైర్మెన్ రామచంద్ర, డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి పాల్గొన్నారు.