Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఈవెంట్ పరిశ్రమకు చెందిన పలువురు భాగస్వామ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండిస్టీ (టీసీఈఐ), తెలంగాణ ఈవెంట్ ఫెసిలిటే టర్స్ అసోసియేషన్ ( టీఈఎఫ్ఎ)లు ఇంట ర్నషనల్ యోగా డే, వరల్డ్ మ్యూజిక్ డేను పురస్కరించుకుని, యోగా సెషన్, సంగీత కచేరీని గచ్చిబౌలిలోని నిథమ్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎనర్జీ డిపార్ట్మెంట్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సునీల్ శర్మ, నిథమ్, మేనేజింగ్ డైరెక్టర్ చిన్నం రెడ్డి, ఈవెంట్ మేనేజ్మెంట్కు చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు. నిథమ్ ప్రాంగణంలో అత్యంత స్వచ్ఛమైన, ప్రశాంతమైన వాతావరణంలో యోగా, ధ్యాన సెషన్‌ను మాస్టర్ ట్రైనర్ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ గౌతం కొప్పిశెట్టి నిర్వహించారు. వీనుల వింద్కెన వేణు నాదంతో శ్రీ ఉమాకృష్ణ, ఆ తర్వాత గాయకుడు, స్వరకర్త, నటుడు ప్రవీణ్ కృష్ణ మూర్తి, గాయని దీప్తి చార్య వంటి ప్రతిభావంతులైన కళాకారులు ఆహ్లాదకరమైన సంగీతం, తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. టీసీఈఐ వ్యవస్థాపక అధ్యక్షుడు సూరత్ సింగ్ మల్హోత్రా, టీసీఈఐ ప్రస్తుత అధ్యక్షుడు బలరాం బాబు ఆల్ల, కార్యదర్శి రవి బూర, కోశాధికారి తౌఫిక్ మహ్మద్ ఖాన్బీ, టీసీఈఐ ఉపాధ్యక్షుడు, టీఈఎఫ్ఏ ధరంపాల్ శ్రావ్య మానస, టీఈఏ ప్రెసిడెంట్ షర్మిల కాసాల, టీఈఏ వైస్ ప్రెసిడెంట్ ఆర్యన్ రాజ్‌పుత్, టీఈఏ కార్యదర్శి చంచల్ శర్మ, టీఈఏ కోశాధికారి మనోజ్ ఇనాని, టీఈఎఫ్ఏ అధ్యక్షుడు నీరూ మోహన్, వైస్ ప్రెసిడెంట్ టీఈఎఫ్ఏ సందీప్ జ్కెన్, టీఈఎఫ్ఏ కార్యదర్శి పవన్, టీఈఎఫ్ఏ కోశాధికారి అజ్మత్, టీఈఎఫ్ఏ జాయింట్ సెక్రెటరీ ఈవెంట్ నుంచి హాజరైన వారిలో టీఈఎఫ్ఏ సభ్యులు జిగ్నా, సంత్ రోహిత్ ఉన్నారు.