Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 58 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లను
- ప్రత్యక్షంగా పరిశీలించాలి
- మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్
- మున్సిపల్ అధికారులతో సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉత్తర్వులు 58 (జీవో 58) ప్రకారం దరఖాస్తు చేసుకుని అర్హులైన వారి ఇండ్లను వేగవంతం చేసి పరిశీలన ప్రక్రయను పూర్తి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీవో 58పై అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, శ్యాంసన్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, ఏవో వెంకటేశ్వర్లు, జిల్లాలోని మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవో 58 ప్రకారం జిల్లా వ్యాప్త ంగా అర్హులైన లబ్దిదారుల ఇండ్లను క్రమబద్దీక రించేందుకు ముందు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీ లించాలని తెలిపారు. ఈ విషయాలపై రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ప్రతినిత్యం జిల్లాలో నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షిస్తూ మానిటరింగ్ చేస్తున్నారని వివరించా రు. జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామనీ, 58 జీవో క్రమబద్దీకరణపై తగు సూచనలు సలహాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఇండ్ల పరిశీలనకు వెళ్లే సమ యంలో తప్పనిసరిగా సంబంధిత అధికారులను తీసుకెళ్ళడంతో పాటు క్రమబద్దీకరణ కోసం దరఖా స్తు చేసుకున్న వారు నిర్మించుకున్న ఇంటిని ఫొటో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. అవి జీవో నిబంధనల ప్రకారం ఉన్నాయా ? లేదా అనే విష యాలను పరిశీలించాలని సూచించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు క్షేత్రస్థా యిలో పర్యటించి గతంలో తమ ఇండ్లను క్రమబద్దీక రించుకోవడానికి దరఖాస్తులు సమర్పించుకొన్న లబ్దిదారుల ఇండ్లను ప్రభుత్వ సూచనలు, నిబంధ నల ప్రకారం మరోసారి పరిశీలించాలన్నారు. ఈ విషయంలో ఇండ్ల పరిశీలన, క్రమబద్దీకరణకు జిల్లాకు 80 టీంలను నియమించామని తెలిపారు. ఈ మేరకు ఐదు రోజుల్లో వివరాల సేకరణతోపాటు అన్ని రకాల పనులు పూర్తి కావాలని ఆదేశించారు. జిల్లాలో ఇండ్ల క్రమబద్దీకరణకు ఇప్పటి వరకు 40 వేల దరఖాస్తులు వచ్చాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పలువురు అడిగిన సందేహాలకు కలెక్టర్ హరీశ్ సమధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్ళి ప్రభుత్వం సూచించిన సూచనలు, నిబంధన లకు అనుగుణంగా ఇండ్ల క్రమబద్దీకరణ చేయాలనీ, ఈ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రమబద్దీకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు, సూచనలు ఉల్లంఘించరాదని సూచించారు. ఇప్పటి కే జిల్లా వ్యాప్తంగా ఇండ్ల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్న వారి ఇండ్లను నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించాలని తెలిపారు. దీనికి బృందంలోని సభ్యులందరూ కలిసి పని చేస్తే సులువుగా పూర్త వుతుందని తెలిపారు. ఇండ్ల క్రమబద్దీకరణకు ఇప్పుడు ఉన్న సిబ్బంది సరిపోతే మరికొంత మంది సిబ్బందిని కూడా వారికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ అధికా రులు, రెవెన్యూశాఖ, ప్రత్యేక, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.